ఆంధ్రప్రదేశ్ ప్రదేశిక్ మార్వారీ సమ్మేళన్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేశారు

ఆంధ్రప్రదేశ్ ప్రదేశిక్ మార్వారీ సమ్మేళన్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేశారు.
  
  రాజస్తాన్ సాంస్కృతిక మండలి  లో 600 మంది వరకూ ఈ అవయవాలను ఉచితంగా అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. జీవీఎంసీ కమీషనర్ లక్ష్మీశ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. కాళ్ళు.. చేతులు లేక నిస్సహాయ స్థితి లో ఉన్నవారికి కృత్రిమ అవయవాలు అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక్ మార్వారీ సమ్మేళన్ వారిని అభినందించారు. 
  సామాజిక బాధ్యతతో ఇతర ప్రాంతాల ప్రజలు ఈ ప్రాంత ప్రజల అవసరాలను చేర్చడంలో మేము సైతం అన్న చందంగా చేస్తున్నా సేవ చేదోడుగా ఈ మంచి కార్యక్రమానికి తమ వంతుగా ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి లో వర్కింగ్ జర్నలిస్ట్ గా సామాజిక బాధ్యతతో కీలక భూమిక పోషిస్తున్న ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ తరపున, వెనక్కు నెట్టబడిన ఉత్తరాంధ్రలో గొంతు లేని ప్రజల గొంతుకగా తమ వంతు సామాజిక బాధ్యత
 ₹ 50,000/- చెక్కును యూజే ఎఫ్ అధ్యక్షులు డాక్టర్.ఎం.ఆర్. ఎన్. వర్మ, ఇతర జర్నలిస్ట్ లు జీవీఎంసీ కమీషనర్ లక్ష్మీశ చేతుల మీదుగా మార్వారీ సమ్మేళన్ ప్రతినిధులకు అందజేశారు. 
ఈ కార్యక్రమం లో పద్మశ్రీ డాక్టర్. అదినారాయణ ను ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ఇతర సంఘాలు  ఘనంగా సత్కరించారు.

 పాత్రికేయులు  N. నాగేశ్వరరావు , B.రవి, మధు గోపాల్ , p.హరినాథ్ శివారెడ్డి ,చక్రి ,కుమార్ ఇతర అనేక మంది పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు