విద్యార్థిని కి ఫాబ్ చేయూత తగరపువలసకి చెందిన పట్టా స్వాతి అనే నర్సింగ్ విద్యార్థినికి ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి (ఫాబ్) తన తోడ్పాటును అందించింది

తగరపువలసకి చెందిన పట్టా స్వాతి అనే నర్సింగ్ విద్యార్థినికి ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి (ఫాబ్) తన తోడ్పాటును అందించింది. భీమిలిలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని కాలేజ్ రుసుమును ఫాబ్ సభ్యులు ఆమెకు అందజేసారు. 
విజయనగరం లోని నర్సింగ్ కళాశాలలో విద్యను అభ్యసిసస్తున్న ఈమె పేదరికం కారణంగా కళాశాల రుసుము చెల్లించడానికి ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకొని, ఆమె కళాశాల రుసుమును ఈ రోజు ఫాబ్ సభ్యులు అందజేశారు.

 ఈ సందర్భంగా ఫాబ్ నిర్మాణంలో చిత్రీకరించిన జయహో భీమిలి పాటను ఫ్రెండ్స్ అసోషియేషన్ భీమిలి యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేశారు. భీమిలి విశిష్టతను తెలిపే ఈ పాటను అందరూ వీక్షించి ఆశీర్వదించాలని ఫాబ్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ మంథా, శ్రీనివాస్ మంథా, రాజు ఉసిరికల, సన్నీ కాళ్ళ, సూర్య శ్రీనివాస్ ముసునూరి మరియు ఇతర ఫాబ్ సభ్యులు పాల్గొన్నారు.