సమాజంలో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.. జడ్జి జి విజయలక్ష్మి

భీమునిపట్నం జనసేవ :-
       సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని  అందుకు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని భీమునిపట్నం ఒకటవ అదనపు జూనియర్ సివిల్  కోర్టు, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జడ్జి జి విజయలక్ష్మి  అన్నారు.

శనివారం భీమునిపట్నం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా జడ్జి జి విజయలక్ష్మి ఆధ్వర్యంలో  లోక్ అదాలత్ నిర్వహించారన్నారు.1వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు  జడ్జ్ జి విజయలక్ష్మి... రాజీ పడ్డ కేసులను పరిశీలిస్తూ తొలగించారు.

  ఇందులో అన్ని రకాల  2419 కేసులను పరిష్కరించారు .   రాజీ కుదుర్చుకుని వచ్చిన కేసులను జడ్జి పరిష్కరించి ,  ఎన్నాళ్లనుంచో  పరిష్కారం కానీ భార్య భర్తలను ఒక్కటిగా చేశారని తెలిపారు.

 జడ్జి జి విజయలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో చట్టాలపై అవగాహన ఉండాలని, అవగాహన కలిగి ఉన్నప్పుడే ముందుకు సాగుతమన్నారు. దానికి ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆమె తెలిపారు. 

ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఈ సందర్భంగా పరిష్కరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో  జడ్జిలు  కె విశ్వేశ్వరరావు, ఎస్ మనీ, లోక్ అదాలత్ సభ్యులు పి. ఎస్ చందు , న్యాయవాదులు, కక్షిదారులు,పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

భీమిలి రిపోర్టర్
 పి శ్రీనివాసరావు