నిన్న మహాశివరాత్రి ని పుణ్యదినం న జాగారం పూజలు

నిన్న మహాశివరాత్రి ని పుణ్యదినం న జాగారం పూజలు తదుపరి సుమారు 20000నుండి 25000 మంది భక్తులు గోస్తనీ సాగరసంగమం నందు చుట్టూ ప్రక్కల హి గ్రామాలనుండి భక్తులు వచ్చి, స్నానాలు చేసి ఆలయాలు లో దర్శనాలు చేసుకొని ఎంతో సంతోషముగా భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. 
ముందు చూపుగా  మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు  ఆదేశాలు మేరకు, స్థానిక జీవీఎంసీ సిబ్బంది, శానిటరీ, ఇంజినీరింగ్ సిబ్బంది తగు ఏర్పాట్లు చేయడం, ముఖ్యం గా పోలీస్ సిబ్బంది. సి ఐ వెంకటరమణ  ఎస్ ఐ రాంబాబు  వారి సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు, శానిటరీ సిబ్బంది సేవలుచూసి భక్తులు ఎంతో కృతజ్ఞతలు, ప్రశంసలు కురిపించేరు.. అలాగే గజ ఈతగాళ్లు ఏర్పాటు చేయడం. చాలా మంచిది అయ్యింది. 
ఈ సందర్భముగా, వచ్చిన భక్తులుకు .S A W వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్. కె . మల్లికార్జున రావు, సెక్రెటరీ అప్పలనాయుడు, ట్రెజరర్ బి. బాలాజీ పి ఆర్ ఓ ఎన్. వి .పార్వతీశం మరియు సూర్యనారాయణ వచ్చిన భక్తులుకి త్రాగడానికి మంచినీటి సదుపాయం,తెనీరు టీ. ఏర్పాటు చేశారు.
  వైస్సార్సీపీ నాయకులు    మైలపల్లి షణ్ముఖరావు,   కొప్పల రమేష్ ప్రభావతి  ఏర్పాట్లు  సందర్భముగా హోటల్ వారు  వారి సేవలకు గుర్తుగా, జ్ఞాపికలు బహుకరించడం జరుగుతుంది. 

ఈ సందర్బంగా, అధికారులు ముఖ్యముగా, పోలీస్, జీవీఎంసీ శానిటరీ,  సిబ్బందికి గౌరవ మంత్రివర్యులు  అవంతి శ్రీనివాసరావు  వైస్సార్సీపీ నాయుకులు మైలపల్లి షణ్ముఖరావు,వివిధ స్వచ్ఛంద సంస్థలు సంతోషం తో పాటు శుభాభివందనములు తెలియజేసిరి.

భీమిలి రిపోర్టర్
 పి. శ్రీనివాసరావు