భూ బాధితురాలు వినూత్న నిరసన

 భూ కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలని మొక్కతూ స్థానిక భూలోక మాత అమ్మవారి వద్ద బాధితురాలు  సుంకరి అప్పల రాములమ్మ ప్రత్యేక పూజలు చేసి దీక్షలు చేపట్టారు. 
మండలంలోని బాకురు పాలెం లోగల తమ భూమికి స్థానిక కబ్జాదారులు అభ్యంతరం తెలుపుతున్నారని అంతేకాకుండా మాపై దాడులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. 
ఇక్కడ గల సర్వే నంబర్ 6/11లో 16 సెంట్ల భూమిని తన భర్త సుంకరి అప్పలనాయుడు పేరు మీద 2004 లో కొనుగోలు చేయడం జరిగిందని అప్పట్నుంచి ఈ భూమి  మా అనుభవం లో ఉందని 
 ఫలసాయాన్ని కూడా పొందుతున్నట్లు వివరించారు. 

స్థానికంగా ఉన్న ఎర్ర భారతి ఆమె కుటుంబ సభ్యులు పలుమార్లు తమపై దాడులు చేసినట్లు  పేర్కొన్నారు. ఈ విషయం మండల ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు మీసాల అప్పలనాయుడు తెలియజేయగా అతను వెంటనే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితం లేకపోయిందన్నారు.

 ఈ క్రమంలో భూ కబ్జాదారులు నుండి రక్షణ కల్పించాలని భూలోక మాత అమ్మవారి వద్ద దీక్షలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. రెవెన్యూ సిబ్బందికి పోలీసులకు తమపై న్యాయం చేసేటట్టు చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా బాధితురాలు అప్పల రాములమ్మ తెలిపారు.