న్యాయం చేయండి మహాప్రభో...!

జనసేవ న్యూస్ :ఆనందపురం

 మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన సుంకరి అప్పలరాములమ్మ భూ కబ్జా విషయంలో న్యాయం చేయమని వేడుకుంటుంది.
 ఇదే మండలం బాకురిపాలెం గ్రామం సర్వే నంబర్ 6/11 లో 16 సెంట్లు భూమిని 2004 సంవత్సరంలో తన భర్త అప్పలనాయుడు పేరు మీద కొనుగోలు చేసింది.

 తరువాత ఆ భూమిలో మామిడి తోట వేసి కాపలాదారుని కూడా పెట్టినట్లు ఆమె తెలిపారు. అయితే ఈ క్రమంలో ఆ భూమిపై స్థానిక కబ్జాదారుల కన్ను పడింది.  

అనుభవ దారులైన అప్పల రాములమ్మ కుటుంబీకులపై నెలరోజులుగా దాడులు చేస్తూ వారి హక్కు పత్రాలను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండల ప్రజా సంక్షేమ సంఘం నాయకుడు మీసాల అప్పలనాయుడు అభియోగం.

తన ఆధ్వర్యంలో రెవిన్యూ వారికి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది అన్నారు. దీంతో ఎట్టకేలకు మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించామని ఆయన పేర్కొన్నారు.