ఛలో ఆంధ్రాయూనివర్సిటీ లో భాగంగా ముందస్తు అరెస్టయిన విద్యార్థి నాయకుడు లెంక :


 ఆనందపురం : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహిస్తూ, అవినీతి అవకతవకలకు పాల్పడుతూ ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుతున్న ఉపకులపతి ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డి గారిని రీకాల్ చేసి ప్రజాస్వామ్య పరిస్థితులు పునరుద్ధరించాలని కోరుతూ తెలుగునాడు విద్యార్థి సమైక్య మరియు అఖిలపక్షం గురువారం చేపట్టిన ఛలో ఆంధ్రాయూనివర్సిటీ లో భాగంగా తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ ను ఆనందపురం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా లెంక సురేష్ మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయం లో వైసీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను  చేస్తూ, విద్యాలయం ను వైసీపీ పార్టీ కార్యాలయం లా వాడుకుంటున్నారు అని,  ఎటువంటి తప్పు చేయకుండా ప్రభుత్వం ముందస్తు అరెస్టులను ఎందుకు చేయిస్తుందో ప్రజలు అంతా గమనిస్తున్నారు అని అన్నారు.