పాఠశాలకు ఇన్వెటర్, బ్యాగులు వితరణ :

పాయకరావుపేట : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కే హెచ్ వాడ, పాయకరావుపేట నందు హ్యుటగాజీ తరగతి గదికి శ్రీమతి డి రత్నవేణి గారి జనాపకార్థం వారి కోడలు శ్రీమతి డి సంధ్య ఇన్వెటర్ ను వితరణగా అందజేశారు. ఇన్వెర్టర్ ప్రారంభోత్సవానికి ఇన్నర్ వీల్ ఛైర్మన్ యశోద పాటిబండ, ఇన్నర్ వీల్ తుని ప్రెసిడెంట్ శ్రీమతి డి సావిత్రి, సెక్రెటరీ శ్రీమతి డి ప్రత్యూష మరియు ఇతర సభ్యులు విచ్చేశారు. 


ఈ పాఠశాలలో జనవరి 2022 నుండి రివర్లి ప్రైమరీ స్కూల్, లండన్ వారితో నాలుగవ తరగతి విద్యార్థుల ట్విన్నింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం తమకు అత్యంత సంతోషకరంగా అనిపించిందని, లండన్ విద్యార్థులతో ఆన్లైన్ జరిగే తరగతులకు కరెంటు పోవడం వల్ల భంగం కలగవచ్చు కనుక అటువంటి విద్యుత్తు అంతరాయం జరగకుండా తరగతులు సాఫీగా జరిగి, విద్యార్థులు లండన్ పిల్లలకు హ్యుటగాజీ నేర్పుతూ, వారి విద్యా పద్ధతులు నేర్చుకుంటూ విద్యాభివృద్ధి వైపు అడుగులు వేయాలని, భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి అంతర్జాతీయ అనుసంధానం జరగడం అభినందనీయమని ఇన్నర్ వీల్ ఛైర్మన్, ప్రెసిడెంట్, సెక్రెటరీ హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యా సంబంధ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టిన శ్రీమతి విజయభాను కోటే, వారి విద్యార్థుల కొరకు 20,000 రూపాయల విలువ గల ఇన్వెటర్ ను తన అత్తగారైన డి రత్నవేణి గారి జనాపకార్థం ఈ హ్యుటగాజీ తరగతికి వితరణగా అందజేస్తున్నందుకు సంతోషంగా ఉందని శ్రీమతి డి సంధ్య తెలియజేశారు.ఇన్నర్ వీల్ ఛైర్మన్ శ్రీమతి యశోద పాటిబండ గారు రిబ్బన్ కత్తిరించి, ఇన్వెటర్ ను ప్రారంభించారు. విద్యార్థులకు ఈ సందర్భంగా 20 స్కూల్ బ్యాగులు అందజేశారు. అనంతరం  విద్యార్థులు ఇన్నర్ వీల్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
 ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి డి మంగాదేవి, ఉపాధ్యాయులు శ్రీమతి విజయభాను కోటే, శ్రీ మతి జ్యోతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.