మానవత్వం చాటుకున్న టీం తారక్ ట్రస్ట్ సభ్యులు

 *మధురవాడ* : తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ సభ్యులు ఓలేటి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కొమ్మది లో గల STBL సినిమా హాల్ లో పనిచేస్తున్న 40 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, మానవత్వాన్ని చాటుకున్నారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీం తారక్ ట్రస్ట్ విశాఖపట్నం జిల్లా కో - ఆర్డినేటర్ లెంక సురేష్ మాట్లాడుతూ ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ విడుదల సందర్భంగా 21 వ తేదీ నుంచి 27 తేదీ వరకు దేశ వ్యాప్తంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగానే ఈ రోజు ఈ థియేటర్ లో పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. 

ఈ సినిమా ని ప్రతీ ఒక్కరు థియేటర్ లో చూసి ఆదరించాలని కోరారు. ప్రతీ ఒక్క అభిమాని థియేటర్ వద్ద ప్లకార్డులు కట్టేటప్పుడు జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఓలేటి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రోజూ వారి కూలీ కి థియేటర్ లో పని చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి చిన్న ఉడత భక్తి సాయంగా నిత్యావసర కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. 

ఈ కార్యక్రమానికి సహాయ - సహకారాలు అందించిన థియేటర్ యాజమాన్యానికి, ప్రతీ ఒక్క అభిమానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం తారక్ ట్రస్ట్ సభ్యులు నాగిశెట్టి పృద్విరాజ్, వెంకటేష్, కిషోర్, బూర్లు శ్రీను, గంటా, నాగిశెట్టి సురేంద్ర, అప్పారావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.