విజేతలకు బహుమతులు ప్రధానం!

జనసేవ న్యూస్ : ఆనందపురం
 మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మండలంలోని వెల్లంకి గ్రామం లో మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. 

భీమిలి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కొర్రాయి తేజఆశిష్  ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులపోటీ, చైర్స్ గేమ్,  జల్దీ ఫైవ్ ఆటలు నిర్వహించారు.

 ఇందులోని విజేతలకు తేజ ఆశిష్ తన సొంత నిధులతో సమకూర్చిన బహుమతులను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి ఆటల పోటీలు ఎంతో దోహదపడతాయి అన్నారు. పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.