రాజమండ్రి.
కాంగ్రెస్ పార్టీ పతనం వెనుక ఈ వి ఎమ్ ల మాయా జాలం వుంది. ఈ వి ఎమ్ లతో ఎన్నికలు జరిగినన్నాళ్లు మోదికి తిరుగులేదు.
కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ వి ఎమ్ లను వాడుకుంటున్నాయి.
ఈ వి ఎమ్ ల మోసానికి తొలుత కాంగ్రెస్ పార్టి యే ఆజ్యం.
వై ఎస్ ఆర్ మరణం వెనుక ఈ వి ఎమ్ లు ఒక కారణమా !
మేడా శ్రీనివాస్, సందేహలు ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
-ఈ వి ఎమ్ లతో ఎన్నికలు నిర్వహణ ప్రజా స్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేసారు.ఈ వి ఎమ్ లతో ఎన్నికలు కలుషితం చేయటంలో విదేశి సంస్థల కుట్ర దాగివుందని, తొలుత ఈ వి ఎమ్ లతో ఓట్లను ట్రాప్ చేయటం, ఒక రకమైన అధునాతన సాఫ్టవేర్ ద్వారా మిషన్లను ఆపరేట్ చేయటం, నిర్ణిత ఓట్లలో మెజార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు కుట్రదారులు ముందుగా ప్రిపేర్ చేసిన ప్రోగ్రాం ప్రకారం ఏ పార్టికి మేలు జరగాలో ఆ పార్టికి మేలుజరుగుతుందా ! ఎన్నికల కమిషన్ వారు పోలింగ్ నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు చేసి నప్పటికి కుట్ర దారులు వ్యూహాన్ని చేదించటంలో విఫలం అవుతున్నారని,
ఈ వి ఎమ్ ల కుట్రతో గెలిచిన పార్టీల శాసన కర్తలుగా పాలిస్తున్న కారణంగా ఈ తరహా మోసాలు వెలుగు చూడలేకపోతున్నాయా ! అనేక రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన
ఈ వి ఎమ్ లు బయట లాడ్జీల్లో ప్రత్యక్షమైనా అధికారులు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారని, ఇలాంటి ఘటనల
పై చర్యలకు ఎందుకు సిద్దపడటం లేదని,ప్రస్తుత ప్రభుత్వాలను విదేశీ కార్పొరేట్ సంస్థలు శాసించటమే ఇందుకు కారణంమా ! ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ అంత నామ మాత్రంగానే నిర్వహిస్తున్నారని, భాద్యతాయుతమైన ఎన్నికలు నిర్వహణ జరగటం లేదని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.
కొన్ని విదేశీ కార్పొరేట్ సంస్థలతో జతకట్టిన ఎదో ఒక ధనిక రాజకీయ పార్టి
ఈ వి ఎమ్ లతో ఓటింగ్ మాయాజాలం చేస్తుందని, తొలుత ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీయే నని,రాను రాను
ఈ వి ఎమ్ స్కామ్ లకు సంబంధించి భారతదేశం లో ఒక పెద్ద కార్పోరేట్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుని మోది సర్కార్ ఈ వి ఎమ్ లను సొంత గెలుపుకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందా ! అనే అనుమానాలు ప్రజలను వెంటాడుతున్నాయని, గత 4 పర్యాయాలుగా జరిగిన ఎన్నికలపై ప్రజలకు
ఈ వి ఎమ్ లపై అనేక అనుమానాలు వున్నాయని, కేంద్ర ప్రభుత్వం 60 లక్షల ఈ వి ఎమ్ ల కొనుగోలుకు సొమ్ము చెల్లించగా భారత ఎన్నికల సంఘం వద్ద 40 ఈ వి ఎమ్ లు మాత్రమే వాడుకలో వున్నాయని, 20 లక్షల ఈ వి ఎమ్ లు ఎక్కడ ఉన్నాయో ఎన్నికల సంఘానికి తెలియదంటున్నారని, మిగిలిన 20 లక్షల ఈ వి ఎమ్ లు ఎక్కడ అని స హ చట్టం ప్రకారం దరఖాస్తు దారులు వివరణ కోరగా పొంతన లేని సమాధానాలతో మొత్తం 40 లక్షలు
ఈ వి ఎమ్ లు మాత్రమే మావద్ద వున్నయనే సమాధానంతో దాటవేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బయట పోలింగ్ స్టేషన్ల లో ఉండాల్సిన
ఈ వి ఎమ్ లు బయట ప్రయివేట్ లాడ్జీల్లో పట్టుబడినా అధికారులు చర్యలు చేపట్టక పోవడం విస్మనేయమని, కొన్ని చోట్ల ఈ వి ఎమ్ లు ఆటోలో రవాణా కాబడిన ఘటనలు కూడా వున్నాయని, గుజరాత్ రాష్ట్రం లో ఆనంద్ నియోజకవర్గం లో జరిగిన ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు వందల సంఖ్యలో వ్యత్యాసం వచ్చిన అక్కడ అధికారులు చోద్యం చూసారని,
ఆ తరువాత మొత్తం దేశవ్యాప్తంగా 275 పార్లమెంట్ నియోజకవర్గాలలో పోలింగ్ ఓట్లకు, లెక్కింపు ఓట్లకు వేలల్లో తేడా వచ్చిన ఘటనలపై పిర్యాదు లను పట్టించుకోలేదని, బీహార్ ఎన్నికల్లో సైతం ఈ తరహా ఓటింగ్ కారణంగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయని ఆయన గుర్తు చేసారు.
ఈ వి ఎమ్ కార్పోరేట్ శక్తులను లను కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో ఉపయోగించినట్లు అనుమానాలు వున్నాయని, ఎన్నికల వ్యూహా కర్తగా పేరు గాంచిన "పి కె"సైతం తనకు గల నెట్ వర్కు ద్వారా గతంలో ఉత్తరాది ఎన్నికల్లో ఒక పార్టి విజయానికి
వేల కోట్ల ఖర్చు తో
ఈ వి ఎమ్ శక్తుల సహాయం పొందారనే ఊహాగానాలు వున్నాయని, సాంకేతిక పరిజ్ఞానం లో ప్రపంచం లోనే మొదటి స్థానం లో వున్న అమెరికా లో సైతం ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరపటం విశేషం అని,తీవ్రవాదాన్ని పెంచి పోషించిన అమెరికా చివరకు తీవ్రవాద భాదితులుగా కాబడినట్టు
ఈ వి ఎమ్ ల కుంభకోణానికి అంకురార్పణ జరిపిన కాంగ్రెస్ పార్టి
ఈ వి ఎమ్ లతోనే పతనావస్థకు చేరుకుంటుందని,
ఈ వి ఎమ్ ల కుంభకోణాన్ని పసిగట్టిన వై ఎస్ ఆర్ పై కుట్ర జరిపి హతమార్చారనే ఆరోపణలు, అనుమానాలు అనేకం వున్నాయని ఆయన తెలిపారు.
ఎన్నికల సంఘంకు స్వయం ప్రతిపత్తి అధికారులు వున్నా కొన్ని సొంత ప్రయోజనాల కోసం ప్రధాన రాజకీయ పార్టిలకు అడుగులకు మడుగు లెత్తు తున్నారని,ఎన్నికల సంస్కరణలకు అఖండ జ్యోతిగా నిలిచిన టి ఎన్ శేషన్ వంటి గొప్ప వారు నేడు భారత్ కు అవసరం వుందని ,ముందు ముందు జరగబోయే ఎన్నికలు సైతం విదేశీ కార్పొరేట్ల కను సైగతోనే జరుగుతాయని, ఓటర్ల దృష్టి మళ్లించటానికే ఓటుకు నోటు అలవాటు చేస్తు మరో ప్రక్క ఈ వి ఎమ్ లతో కుట్ర సాగిస్తున్నారని, ప్రధాన రాజకీయ పార్టీల నుండి ఎన్నికల్లో పోటి చేసిన అందరి అభ్యర్థుల వద్ద ఓటరు నోటు తీసుకుంటున్నారని అందుచేత కార్పోరేట్ శక్తులు ఓటర్ ను నమ్మకుండా
ఈ వి ఎమ్ స్కామ్ లను నమ్ముకుంటున్నారని, ప్రజల్లో తిరుగుబాటు రాకుండా మెజారిటీ స్థానాలు కుట్రతో పొందుతున్నారని, అవసరం లేని స్తానాల్లో కుట్ర దారులు గెలుపుకు పోటీపడటం లేదని ఆయన జరుగుతున్న పరిణామం తెలిపారు .
అధికారంలో వున్నప్పుడే తదుపరి గెలుపుకు కావలసిన శాస్త్రీయ పరమైన కుట్రలకు మార్గం చేసుకుంటున్నారని, అను వైన యంత్రాంగంను నియమించుకుంటున్నారని,నేర పరిశోధన కు గల ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలను బలహీన పరుస్తున్నారని, నిజాయతి గల అధికారులను, అంకుఠిత దీక్షతో విధులు నిర్వహించే వారిని అధికార మదంతో నలిపేస్తు వేధిస్తున్నారని, బ్యాలెట్ రాజ్యాంగ బద్దమైన హక్కు అని, ఈ వి ఎమ్ అనేది అక్రమార్కులకు వరం అని, అనేక సందర్భాలలో
ఈ వి ఎమ్ ల ట్యాపరింగ్ కు గల అవకాశాలను నిపుణులు శాస్త్రీయంగా నిరూపించారని,
ఇప్పటి వరకు జరిగిన పేరుగాంచిన వ్యక్తుల మరణాలకు నేర పూరిత కుట్ర లు దాగి వున్నాయా ! అని ప్రజలు అనుమానిస్తున్నారని , నిష్పక్ష పాతంగా నిరూపించే స్వేచ్చ ప్రస్తుత అధికారులకు లేకపోవటం దురదృష్టం అని, అనేక మిస్టరి ఘటనల్లో వాస్తవ కారణం వెలుగు చూడకుండానే కేసు పరిశోధన ముగించేస్తున్నారని, భారతదేశంలో ప్రజాస్వామ్యం క్రింద నలిగి పోతున్నవారు 90% మంది అని, 10% మంది మాత్రమే ప్రజా స్వామ్య హక్కులను, స్వేచ్చ ను పొందుతున్నారని, భారతదేశంలో రాజ్యాంగ బద్దమైన హక్కులు అమలు కావటం లేదని, ముందుగా ఈ వి ఎమ్ లను రద్దు పరచి బ్యాలెట్ పద్దతిలో ప్రవేశ పెట్టి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని, భారతదేశంలో రాజ్యాంగ బద్దమైన అనేక పాలనా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వుందని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు.
సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి,దుడ్డె త్రినాద్, ఎండి హుస్సేన్, ఆర్ కె చిట్టి, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మార్త ప్రభాకర్, వాడపల్లి జ్యోతిష్, వల్లి శ్రీనివాసరావు,పిల్లాడి ఆంజనేయులు, మట్టపర్తి తులసి, ముదపాక రామకృష్ణ, కె. భాస్కర్, ముదపాక లక్ష్మి, రెడ్డి స్వర్ణ లత, కోట సుశీల, కొల్లిమళ్ల లక్ష్మణరావు, ఎస్ కె వల్లి, తదితరులు పాల్గొనియున్నారు