బస్ కాంప్లెక్స్ ఏర్పాటుకు డిమాండ్కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

జనసేవ న్యూస్ :ఆనందపురం
 ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరుపొందిన వేములవలస పూల మార్కెట్ కు వచ్చే వ్యాపారులు రైతులు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారని స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తెలిపారు.
 ఆనందపురం మండలం లోని 26 పంచాయతీలు 46 రెవెన్యూ గ్రామాలు ఉండగా విజయనగరం, శ్రీకాకుళం,  విశాఖ సిటీ,  పెందుర్తి, సబ్బవరం, పాయకరావుపేట నుండి కూడా వ్యాపారులు కడకు వస్తుంటారని చెప్పారు.  

స్థానికంగా వేములవలస జంక్షన్లో కాస్త విరామం తీసుకోవడానికి కూడా వీలులేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ట్రాఫిక్ గజిబిజి తో నానా ఇక్కట్లు పడుతున్నారని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. 

 ఈ సమస్యను అధిగమించాలంటే స్థానికంగా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు,  నేషనల్ హైవే పిడి ని కలవనున్నట్లు చెప్పారు.

 ఎటువంటి పరిస్థితుల్లో అయినా బస్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.