చిట్టివలస జూట్ మిల్ కార్మికులకు పి ఎఫ్ లు

చిట్టివలస జూట్ మిల్ కార్మికులకు ఈనెల ఒకటో తేదీ  నుండి పి ఎఫ్ లు రాస్తున్న సంగతి తెలిసిందే ఈరోజుకి సుమారుగా 250 మంది కార్మికులు రాయించుకుని  తమ అప్లికేషన్లను రామ్ కుమార్ కు అందజేశారు. 

అలాగే కార్మికులకు ఇబ్బంది లేకుండా పిఎఫ్ కమిటీ  మెంబర్లు  పూసర్ల నర్సింగరావు  సాడి సూరిబాబు చిట్టివలస జూట్ మిల్ కార్మికులకు అందుబాటులో ఉంటారు పిఎఫ్ రాయించు కోవలసిన  కార్మికులు రాయించు కోవాల్సింది గా ఐ ఎన్ టి యు సి వర్కింగ్ ప్రెసిడెంట్ జీరు వెంకటరెడ్డి  కోరారు. 

నిన్న 04-03-2022 దల్లి అప్పల రెడ్డి ఇచ్చిన  తప్పుడు వార్త నుద్దేశించి ఈరోజు బహిరంగంగా గా చిట్టివలస జూట్ మిల్ మెయిన్ గేట్ వద్ద వివరణ ఇచ్చారు కార్మిక కాంగ్రెస్ సంఘం అధ్యక్షులైన జీరు కైలాస రెడ్డి దల్లీ అప్పల రెడ్డి మరియు మరగడ ఆదినారాయణ రెడ్డి వాళ్ల ఆరోపణలను  ఐ ఎన్ టి యు సి  వాళ్లు తీవ్రంగా ఖండించారు. 

ఈ కార్యక్రమంలో యజమాని ప్రతినిధి రామ్ కుమార్ చిల్ల గణేష్ రెడ్డి ఏరుసు సోమిరెడ్డి మరియు కార్మికులు పాల్గొన్నారు.

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు