అక్రమ మద్యం గొలుసు దుకాణాలపై దాడులు ముగ్గురు వ్యక్తులు అరెస్టు 68 మద్యం సీసాలు స్వాధీనం

భీమునిపట్నం జనసేవ : స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డి టి ఎఫ్ సిబ్బంది విశాఖపట్నం వారు రెండు వేరు వేరు చోట్ల శుక్రవారం అనధికార మద్యం దుకాణాలపై నిర్వహించిన విస్తృత దాడుల్లో 57 మద్యం స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను తమ స్టేషన్ అప్పగించినట్లు స్థానిక ఎస్ సి బి సి ఐ వి రామకృష్ణ విలేకరులకు తెలియజేశారు.
 దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనధికార మద్యం దుకాణాలు నియంత్రణ చర్యల్లో భాగంగా ఆనందపురం మండలం కుసులు వాడ పంచాయతీలొ శుక్రవారం దాడులు నిర్వహించగా అదే గ్రామానికి చెందిన పిల్ల పైడ్రాజు 9 మద్యం సీసాలతో పట్టుబడ్డాడని అలాగే గొట్టి పల్లి పంచాయతీకి చెందిన బుత్తల బంగారు నాయుడు 48 మద్యం సీసాలతో పట్టు బడ్డాని తెలిపి, వారి వద్ద నుండి మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం ఎసిబి స్టేషన్ భీమిలి పట్నం అప్పగించినట్లు తెలిపారు.
 అలాగే భీమిలి పట్నం మండలం ఎసిబి బ్యూరో భీమునిపట్నం సిబ్బంది శనివారం దాడులు నిర్వహించగా అనధికార మద్యం దుకాణం నిర్వహిస్తున్న మజ్జి పేట గ్రామానికి చెందిన గండి బోయిన అప్పన్న నీ 12 మద్యం సీసాలతో పట్టుకున్నట్లు తెలిపారు ఈ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి శనివారం భీమునిపట్నం కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచగా జరిగిందన్నారు. 

ఈ దాడుల్లో ఎసిబి బ్యూరో భీమునిపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సైపద్మావతి సిబ్బంది పాల్గొన్నారు.

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు