కలిగొట్ల స్నిగ్దశ్రీదేవి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 6వ రక్త దాన శిబిరమును ముఖ్య అతిధిగా" అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ "పీ. ఎమ్. పాలెం (నార్త్)

కలిగొట్ల స్నిగ్దశ్రీదేవి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో , A S రాజా బ్లడ్ బాంక్ వారి సౌజన్యంతో ఆది వారం ఉదయం 9 గం. నుండి మద్యాహ్నం 12 గం.వరకు జరిగిన 6వ రక్త దాన శిబిరమును ముఖ్య అతిధిగా" అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ "పీ. ఎమ్. పాలెం (నార్త్), విశాఖపట్నం, చుక్క. శ్రీనివాసరావు ప్రారంభించారు. మరియు గౌరవ అతిథిగా G V రమణ ' ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భీమునిపట్నం, పాల్గొన్నారు.


        ఈ రక్త దాన శిబిరంలో ఎలియన్స్ హోటల్ మానాజ్మెంట్,మద్దిల పాలెం, ఇంచార్జి నరేంద్ర విద్యార్థులు, యు టి ఎఫ్. ఉపాధ్యాయ సభ్యులు, ప్యూఫుల్స్ పవర్ సభ్యులు, ఓ ఎస్ జి. ఫౌండేషన్ శివ, మరియు తాటితురు, తాళ్ల వలస, ఆనందపురం, తగరపువలస భీమిలి తదితర ప్రాంతాల నుండి ఎక్కువగా యువత 90 మంది రక్తదానం లో పాల్గొన్నారు.
    ఈ శిబిరాన్ని డాక్టర్ ఉపాద్యాయుల. క్షిపణి, డి డి రవిశంకర్ పర్యవేక్షించారు.
     ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ కలిగొట్ల శ్రీరామ్, కలిగొట్ల సూర్య నారాయణమూర్తి, కలిగొట్ల వెంకట భానోజిరావు కలిగొట్ల శ్రీనివాసరావు, కలిగొట్ల అనూరాధ, కలిగొట్ల పద్మజ, కుటుంబ సభ్యులు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.