రక్షిత్ డ్రగ్స్ లో ఘనంగా 51వ భద్రత వారోత్సవ వేడుకలు

 *పరవాడ* : పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రు పారిశ్రామిక వాడలో గల రక్షిత్ డ్రగ్స్ కంపెనీ లో 51వ భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ డి.చంద్రశేఖర్ వర్మగారు, రాంకీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ డా.పి.పి. లాల్ కృష్ణ గారు, రక్షిత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రామేశ్వర రావు గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి. చంద్రశేఖర్ వర్మ గారు మాట్లాడుతూ ప్రతీ ఉద్యోగి తమ తమ పనులను ఎటువంటి ప్రమాదం జరగకుండా సక్రమంగా నిర్వహించాలని, ప్రతీ పరిశ్రమ కూడా ఉద్యోగుల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. 

భద్రత ను పెంపొందించటానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 51వ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని "భద్రత సంస్కృతిని పెంపొందించుకొనేలా యువతను ప్రోత్సహించండి" అను నినాదంతో యువతలో అవగాహన కల్పిస్తున్నాయని అన్నారు. 

రాంకీ మేనేజింగ్ డైరెక్టర్ లాల్ కృష్ణ గారు మాట్లాడుతూ రాంకీ పారిశ్రామిక వాడలో ఉన్న అన్ని పరిశ్రమలు కూడా భద్రత విషయంలో పూర్తి ప్రమాణాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇలాంటి కార్యక్రమాల వలన ఉద్యోగులలో భద్రత పై మరింత అవగాహన ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. 

రక్షిత్ గ్రూపు ఆఫ్ కంపెనీస్ అధినేత రమేశ్వర రావు గారు మాట్లాడుతూ మా సంస్థ లో పని చేసే ఉద్యగులకు భద్రత పై అవగాహన ఉండేందుకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా మా రక్షిత్ యాజమాన్యం పరిశ్రమలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధునాతన పరికరాలను వాడుతున్నామన్నారు. 

రక్షిత్ సంస్థ హెచ్.ఆర్ మేనేజర్ యమ్.పి.దొర మాట్లాడుతూ మా సంస్థ భద్రతా ప్రమాణాలను పాటించటంలో ఎటువంటి రాజీ పడకుండా, జీరో ఆక్షిడెంట్ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు భద్రత పతాకం ఆవిష్కరించి, ఉద్యోగుల అందరిచేత రక్షిత్ డ్రగ్స్ సేఫ్టీ మేనేజర్ పార్థుసారధి నాయుడు భద్రతా శపథం చేయించారు. 

ఈ భద్రతా వారోత్సవంలో భాగంగా భద్రత కు సంభందించి వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అందులో గెలుపొందిన వారికి ముఖ్య అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం సేఫ్టీ వారు నిర్వహించిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.

 ఈ కార్యక్రమంలో రక్షిత్ డ్రగ్స్ యూనిట్ మేనేజర్ శ్రీధర్ నాయుడు, రక్షిత్ ఫార్మా కంపెనీ యూనిట్ మేనేజర్ శివ ప్రసాద్, మేనేజర్లు షరీఫ్, రత్న ప్రసాద్, హెచ్.ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.