జర్నలిస్టులు నిరంతర శ్రామికులు l జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లకు ఘనంగా సత్కారం

 *అక్కయ్య పాలెం*: జర్నలిస్టులు, ప్రజల సహకారంతోనే తాను జాతీయ జర్నలిస్టుల సంఘం(ఎన్ ఏ జే) కార్యదర్శిగా రెండోసారి నియమితులు కావడం జరిగిందని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. 

బుధవారం ఇక్కడ అక్కయ్యపాలెం కార్యాలయంలో సింహాచలం కు చెందిన పలు యువజన సంఘాల నాయకులు శ్రీనుబాబు ను  ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ తాను జాతీయ స్థాయి కి ఎదిగేందుకు 

ఎంతోమంది సహకారం అందించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.. ప్రధానంగా గ్రామస్తుల సహకారం మరుపురానిదన్నారు.... జర్నలిస్టులు నిరంతర శ్రామికులని  వారి సంక్షేమానికి తనవంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వివరించారు..

 ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ యువజన సేవా సంఘం శ్రీనివాస యువజన సేవా సంఘం నేతలు గంట్ల కిరణ్ బాబు, దొంతల సంతోష్.. పాలూరి రమణ దొంతల అప్పన్న సిడగంవాసు, సిడగం అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.