పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు ఒకరోజు శిక్షణ

(శనివారం 5-2-22
జనసేవ న్యూస్ రామభద్రపురం )
బాడంగి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గల 10 పాఠశాల 150 మంది తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు ప్రధానోపాధ్యాయులు సిద్ధాంతం త్రినాథరావు కోర్స్ డైరెక్టర్ గా జిల్లావిద్యాశాఖ ఆదేశానుసారం నేడు శిక్షణా కార్యక్రమం బాడంగి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు .

ఈ శిక్షణలో ప్రధానంగా పేరెంట్స్ కమిటీ సభ్యుల విధులు, భాద్యతలు, నూతన విద్యా విధానం,బాలల హక్కులు, కమిటీ సమావేశం నిర్వహణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారీ, పాఠశాల సామజిక తనిఖీ, ప్రజల భాగస్వామ్యం  స్థానిక సంస్థలు పాత్ర, స్వచ విద్యాలయం, 

బాలల హక్కుల చట్టం, సమగ్రశిక్ష కార్యక్రమాలు, విద్యా నవరత్నాలు ఐన అమ్మఒడి, మధ్యాహ్నం భోజనం, ఆంగ్లమాద్యమం, విద్యా ప్రమాణాలు పెంపు వంటి అంశాలలో సభ్యులకు శిక్షణ ఇవ్వటం జరిగింది 

రిసోర్స్ పర్సన్ గా కొల్లి ఈశ్వరరావు వ్యవహరించారు కార్యక్రమంలో ఫస్ట్ అసిస్టెంట్ రమేష్,భాస్కరరావు, సిఆర్పి సర్వేశ్వరరావు, ఈశ్వరరావు.పేరెంట్ కమిటీ సభ్యులు, చైర్మన్లు పాల్గొన్నారు.