జనసేవ న్యూస్ :ఆనందపురం
మండలోని మామిడిలోవ పంచాయితీ దిబ్బమీదపాలెం గ్రామంలో శ్రీ పైడితల్లమ్మ విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
అందులో బాగంగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో పూజలు చేసి అమ్మవారి ఆశిస్సులు పొందుకోవడం జరిగింది.
అనంతరం అన్నదాన సంతర్పణ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారి భక్తోత్సవ తప్పెడిగుళ్ళు ఆటను తిలకించారు.
అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యం దైవ సన్నిధిలో ఉండే నాకు ప్రతిష్ఠత చేయడం చాలా సంతోషంగా ఉందని , పైడితల్లమ్మ గుడి కి విద్యుత్ సరఫరా కల్పించి, సిసి రోడ్డు నిర్మాణం, మంచినీటి సదుపాయం, కల్పించుటకు అలాగే గ్రామస్థులు అమ్మవారి మహాత్సవాలకు సౌకర్యార్థం స్థలం కి వినతి పత్రం అందిస్తే కమ్యునిటీ హాలు నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు.
జీ రవికిషోర్ బ్యూరో చీఫ్