అభివృద్ధి పరచి పోటీపడి అప్పుల ఊబిలో ముంచేస్తున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పనులు తగ్గించాలని మహా ర్యాలీ లో సిపిఐ నగర కార్యదర్శి ఏం పైడి రాజుడిమాండ్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి సంక్షేమ పథకాల పేరుతో అప్పులు ఊబిలో దిం చేస్తున్నారు పెరిగిన పన్నులు తగ్గించాలి ర్యాలీలో విశాఖ నగర సిపిఎం నగర కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై భారాలు మోపుతున్నారు*
ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా దేశ ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం*
సంక్షేమ పథకాలు ముసుగులో ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తున్న రాష్ట్రాన్ని దివాళా చేస్తున్న వైసిపి ప్రభుత్వం*
సీపీఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఎం. పైడిరాజు*
పెంచిన ఆస్థి చెత్త పన్నులు రద్దు చేయాలని, అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు వెంటనే పునర్నిర్మించాలి, విశాఖ ఉక్కు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు అమ్మకాలు ఆపాలని గురువారం     విశాఖ నగరంలో పాత నవరంగ్ సినిమా హాలు వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి పూర్ణమార్కెట్ అలంకార్ సినిమా హాలు మీదగా దుర్గాలమ్మ గుడి వరకు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశ ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని 2015-16 బడ్జెట్లో దేశ ప్రజలకు రానున్న ఐదు సంవత్సరాల కాలంలో 6 కోట్ల ఇల్లు నిర్మించి 24 గంటలు విద్యుత్ మంచినీరు పారిశుద్ధ్యం ఇబ్బంది లేకుండా చేస్తామని అప్పటి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చెప్పారని, రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని దేశంలో ఉన్న 22 వేలు మార్కెట్ యార్డులను ఎలక్ట్రానిక్ యార్డులుగా చేస్తామని, సిల్క్ ఇండియా, స్టార్ట్ ఇండియా, సౌండ్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, న్యూ ఇండియా, స్వచ్ భారత్, ఆత్మ నిర్బర్ భారత్ లాంటి నినాదాలతో మోసం చేసి ఇప్పుడు అమృత్ కాల్ అని కొత్త నినాదం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారని అన్నారు. లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇంకా స్వాధీనం చేయకుండానే 4వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారని రోడ్లు మరమ్మత్తులు పేరు జెప్పి ఇంకో 2వేల కోట్లు రూపాయలు అప్పు తెస్తున్నారని, సంవత్సరం క్రిందట రిటైర్ అయిన ఉద్యోగులకు  చెల్లించవలసిన పి ఎఫ్ భీమా గ్రాడ్యుటీ సొమ్ము పాతిక వేల మందికి  2100కోట్లు రూపాయలు చెల్లిచలేదని, బడ్జెట్లో కేంద్ర ఆంధ్రప్రదేశ్ కి మొండి చెయ్యి చూపిన అడగలేని పరిస్థితిలో రాష్ట్ర పాలకులు ఉన్నారని అన్నారు.
సీపీఐ నాయకులు ఎం మన్మధరావు, ఎం శ్రీనివాసరావు, బి సాంబయ్య ఎం ఆదినారాయణ, ఎం కృష్ణ  కె వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.