భయం గుప్పిట్లో ప్రజలేకాదుపోలీసులు కూడా మంత్రి ప్రవర్తనపైవిచారణ అవసరం ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్


-------------
పోలీస్ ప్రతిష్ట ను దిగజార్చిన మంత్రి. 
ఏపి పోలీస్ కు మంత్రి సిదిరి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భద్రతకు సహకరించాల్సిన మంత్రి సిదిరి అప్పలరాజు భద్రతా చర్యలు చేపడుతున్న సి ఐ రాజుల్ నాయుడు పై దౌర్జన్యం చేయటం బాధాకరం. 
సాటి పోలీసుల సాక్షిగా సి ఐ ను మంత్రి దుర్భాషలాడుతూ చేయి వేసి తోసిన ఘటన పై పిర్యాదు చేయక పోవటం, శాఖా పరమైన విచారణకు ఆదేశించక పోవటం పాలనా వైఫల్యం కాదా  !
పోలీస్ ప్రతిష్ట కు భంగం కలిగినా పోలీస్ సంఘం పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం భాద్యతా రాహిత్యం కాదా  !

--మేడా శ్రీనివాస్, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్