ఆనందపురం:జనసేవ న్యూస్
పార్టీ బలోపేతం కోసం భారతీయ జనతాపార్టీ భీమిలి నియోజకవర్గం ఆనందపురం పార్టీ అధ్యక్షుని నివాసం వద్ద ఈ రోజు మండల పదాధికారుల సమావేశం నిర్వహించినట్లు నియోజకవర్గం కో ఆర్డినేటర్ కంటుభుక్త రామానాయుడు తెలియజేశారు.
మండల అధ్యక్షుడు మీసాల రామునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఆదేశాల మేరకు పలువురుని శక్తి కేంద్ర ప్రముఖులుగా నియమించడం జరిగింది, పిల్లా చిన్నారావుకు నూతనంగా మండల ప్రదాన కార్యదర్శిగా, సరుగుపిల్లి దుర్గారావుకు ఉపాధ్యక్షుడుగా , యెర్రా శివకు కార్యదర్శిగా బాధ్యతను ప్రకటించడం జరిగింది.
ఈ సమావేశంలో రాష్త్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, రాష్త్ర భవన నిర్మాణ కార్మికుల సెల్ సభ్యులు కోరాడ శంకర రావు, జిల్లా కిసాన్ మొర్చా ప్రదాన కార్యదర్శి ప్రసాదరావు పట్నాయక్ , మండల ప్రధానకార్యదర్శి ఇల్లిపిల్లి రాము, ఉపాధ్యక్షులు గండ్రెడ్డి వెంకట రావు,బోర శ్రీనివాస రావు, కార్యదర్శి నిమ్మకాయల అప్పల రాజు, కోశాదికారి ఉప్పాడ శివ తదితరులు పాల్గొన్నారు.