ఆనందపురం :జయజయ హే
మండలంలోని వేములవలస గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక పంచాయతీ ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు వారిదే భావితరాల భవిష్యత్ కనుక చిన్నారుల విషయంలో ఏమాత్రం అలసత్వం చేయకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.
అప్పట్లో ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల చిన్నారులకు పోలియో ఏర్పడి అంగవైకల్యంతో బంగారు భవిష్యత్తు పాడైపోయింది అని గుర్తు చేశారు.
మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తో పాటు అంగన్వాడి టీచర్ నదియా ఆరవ వార్డు సభ్యుడు అప్పారావు, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.