కోవిడ్ సమయంలో పెరిగిన నియంతృత్వం పార్టీ సభ్యులసమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి ఆవేదన

కోవిడ్ పరిస్థితుల్లో పాలకవర్గాల్లో నియంతృత్వ ధోరణి పెరిగిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి అన్నారు. 
సిపిఐ విశాఖ జిల్లా సమితి సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో చట్టసభల్లో చర్చ లేకుండానే పలు నియంతృత్వ చట్టాలను తీసుకొచ్చారని చెప్పారు. గట్టిగా ప్రశ్నించిన వారిని ఉపా చట్టం కింద జైలులో వేస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పేరుతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల నిర్వహించిన సమావేశం ప్రపంచ దేశాలపై పెత్తనాన్ని పెంచుకునేందుకేనని  అన్నారు. నాటో పేరుతో పశ్చిమ యూరప్ దేశాలపై అమెరికా పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.
ప్రపంచంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు యూరప్ లో 
వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అన్నారు. 
చైనా ప్రస్తావన లేని ప్రపంచం లేదన్నారు. చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలని పెట్టుబడిదారి దేశాలు ప్రయత్నిస్తుంటే మరోపక్క సోషలిస్టు ప్రభుత్వాలు పలుచోట్ల అధికారంలోకి వస్తున్నాయని  అన్నారు. సామాన్యులు, ఉద్యోగులకు బడ్జెట్లో ఎటువంటి ప్రయోజనాలు లభించలేదని అన్నారు. ఉద్యోగులకు ఆదాయపు పన్ను పరిమితి పెంచలేదని అన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ ల మధ్య పోటీ నెలకొందని, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. బడ్జెట్లో రాష్ట్రం ప్రస్తావనే లేదని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి కేటాయించలేదని అన్నారు. పిఆర్సీ పై ఉద్యోగులకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తోందని అన్నారు. ఉద్యోగుల ఉద్యమంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు ముందుకు తీసుకొచ్చారని విమర్శించారు.
కె. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బి వి రమణ సహాయ కార్యదర్శి పి సత్యనారాయణ నగర కార్యదర్శి ఎం పైడిరాజు కార్యవర్గ సభ్యులు ఎ విమల ఎస్ వి మూర్తి ఎం రాజబాబు పి పోతురాజు ఎం రామునాయుడు కె సత్యాంజనేయ ఇ దేముడు జి గురుబాబు తదితరులతో పాటు పలువురు జిల్లా సమితి సభ్యులు మండల కార్యదర్సులు పాల్గొన్నారు