మా గ్రామానికి రోడ్డు వేయండి అంటూ గిరిజనులు విన్నూత ప్రదర్శన

 *రావికమతం* : విశాఖపట్నం జిల్లా లో ఏజెన్సీ ప్రాంతాల్లో  పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. చిన్ని ఆరోగ్య సమస్య అయినా, ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నా అక్కడి ప్రజలు ఆస్పత్రులకు చేరాలి అంటే నరక యాతన అనుభవించక తప్పడం లేదు. అప్పుడప్పుడూ  కాదు నిత్యం ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపిస్తూనే ఉంటాయి.

 ప్రభుత్వాలు మారినా, పాలకులు మారిని, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినా వారికి రోడ్డు సదుపాయం మాత్రం రావడం లేదు.

 దీంతో ఎన్నాళ్ళు తమ గ్రామాలకు ఈ డోలీ మోతలు, ఇంకెన్నాళ్లు మాకు ఈ కష్టాలు అంటూ విన్నూత గా నిరసన తెలియజేశారు. దీంతో మాకు మైనింగ్ వద్దు - రోడ్లు ముద్దు అనే నినాదంతో అర్ధ నగ్న ప్రదర్శన తో నిరసన బాట పట్టారు.  

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అజయ్ పురం ఆదివాసులు రెండు కిలోమీటర్ల దూరం అర్ధనగ్నంగా ర్యాలీ చేశారు. గోచి కట్టి ప్రదర్శన, డోలీలతో తిరిగి ఆందోళన వ్యక్తం చేశారు. 

అజయ్ పురం నుండి జెడ్ జోగంపేట వరకు ప్రదర్శన నిర్వహించారు  విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజయ్ పురం గ్రామంలో 150 మంది ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు.

 తమ గ్రామస్తులు అందరికీ ఎన్నో సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు నిర్మాణం చేశారు. తర్వాత కాలంలో గ్రానైట్ క్వారీలు వచ్చిన తర్వాత, గ్రామానికి రోడ్డు రూపు రేఖలు మారిపోయాయి.