ఘనంగా జరిగిన రెండవ రోజు వేడుకలు

జనసేవ న్యూస్ :ఆనందపురం 

శ్రీమతి పట్నాయకుని శుభ లక్ష్మి పేరంటాలు మాఘ శుద్ధ పౌర్ణమి 37వ వార్షికోత్సవం 2వ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 
శుభ లక్ష్మి నగర్, వెల్లంకి శ్రీమతి పట్నాయకుని శుభ లక్ష్మి పేరంటాలు మందిరం వద్ద 
ఉదయం 8 గంటల నుండి,సాయంత్రం వరకు, శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో,ట్రస్ట్ వ్యవస్థాపకులు,పి.జాని కేశ్వరరావు, చైర్మన్ పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్,ట్రెజరర్ పి.బాల గోవిందారావు పూజా కార్య క్రమంలు ఘనంగా నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో భాగంగా 500 మందికి,అన్న సమారాధన నిర్వహించారు,

ఈ కార్యక్రమం లలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి,ట్రస్ట్ సభ్యులు, బంధువులు హాజరై మొక్కుబడులు తీర్చుకున్నారు,

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు,వెల్లంకి గ్రామ పెద్దలు,బిజెపి నాయకులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు,టిడిపి నాయకులు,జనసేన నాయకులు, హాజరయ్యారు.

జీ రవికిషోర్ బ్యూరో చీఫ్