జనసేవ న్యూస్ :ఆనందపురం
మండలంలోని బంటుపల్లి కళ్లాలుకు చెందిన అడ్వకేట్ బంటుపల్లి రాము కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
బోయపాలెం సమీపంలోగల కాపులుప్పాడ వద్ద ఉన్న చెరుకూరి లేఅవుట్ లో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లి కుమారుడు కోరాడ సాయి దినేష్, పెళ్ళికుమార్తె అలేఖ్య లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనందపురం మండల నాయకులు తో పాటు,
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తరఫున ముత్తంశెట్టి మహేష్, మంత్రి భార్య జ్ఞానేశ్వరి, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్ల ఎమ్మెల్యే బొడ్డు కొండ అప్పలనాయుడు, మాజీ భీమిలి ఎమ్మెల్యే కర్రి సీతారాం, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,
జనసేన పార్టీ నుండి పంచకర్ల సందీప్, ముక్కా వాసు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పృథ్వీరాజ్, జి ఎమ్ రెడ్డిలతో పాటు
మండా రవి, హరీష్, వెంకటేష్, రామకృష్ణ నాయుడు, భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు, అతని కుమారుడు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు
కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
తదితరులు హాజరై వియ్యంకులు అయిన బంటుపల్లి రాము, కోరాడ సూర్యారావులకు అభినందనలు తెలిపారు.
జీ రవికిషోర్ బ్యూరో చీఫ్