విద్య వైద్యం ఉచితంగానే ప్రజలకు ప్రభుత్వం అందించాలి కల్తీ నీనియంత్రించాలి రాష్ట్రీయప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ డిమాండ్


-------------
విద్యా - వైద్యం ను ప్రభుత్వమే నిర్వహించాలి. 
కాబోలు వ్యాపారాన్ని మరిపిస్తున్న ప్రయివేట్ విద్యా వ్యాపారం. 
ప్రాణాలు రక్షించే వైద్యులు కరువయ్యారు. 
అన్ని రక్త పరీక్షా కేంద్రాలలోను ఒకే ధర అమలు చేయాలి. 
నకిలీ మందుల మాఫియా పై నిరంతర నిఘా అమలు  చేయాలి. 
విద్యార్థుల కుటుంబాలను, రోగులను ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం రాబందుల వలే పీక్కుని తింటున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన చెందారు. 
మార్కెట్ లో లభించే ప్రతి ఆహార ప్రధార్ధం కలుషితం గాను, రసాయనికంగాను లభిస్తున్నాయని, ఆరోగ్య శాఖ, విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంట్ సంబంధిత ఇతర శాఖలు  అవినీతి కూపంలో కూరుకుపోయి నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తు కలుషిత, రసాయనిక ఆహార ప్రధార్థాలను  ప్రోత్సహిస్తు ప్రజల అనారోగ్యాలకు కారకులైతున్నారని,
పసి పిల్లల ఆరోగ్యాలకు, యువత ఆరోగ్యాలకు నేడు భద్రత లేదని, ప్రభుత్వ వైద్య శాలలు పనితీరు అంతంత మాత్రమే నని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు కొన్ని గంటలు మాత్రమే వైద్య సేవలకు అందుబాటులో వుంటున్నారని, ఎక్కువ శాతం ప్రయివేట్ వైద్య వ్యాపారం లో అధిక  సమయం గడుపుతారని,
ప్రయివేట్ ఆసుపత్రుల్లో రోగి నుండి సొమ్ములు ఖర్చు పెట్టించటంపై వున్న ఆశక్తి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే నారాయణుడి హృదయం వుండదని, వేళ్ళమీద లెక్కపెట్టే విధంగా అతి కొద్ది మంది గొప్ప వైద్యులు మాత్రమే ఉండటం బాధాకరమని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
విద్యా, వైద్యం ఖరీదైన వ్యాపారంగా మార్చేసారని, రాజ్యాంగ బద్దమైన ప్రాధిమిక హక్కు ను ప్రయివేట్, కార్పోరేట్ శక్తుల కబంద హస్తాలలో నేటి పాలకులు తాకట్టు పెట్టారని, పాలకులు వ్యూహాత్మకంగానే ప్రభుత్వ విద్యా వైద్యం పై ప్రజలకు నమ్మకం లేకుండా భయబ్రాంతులకు గురిచేస్తు ప్రయివేట్ కార్పొరేట్ విద్యా వైద్యం ను ప్రోత్సహిస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన పరికరాలు వున్నా అవి రోగులకు ఉపయోగ పడని విధంగా నిర్వీర్యం చేస్తు ప్రయివేట్ వ్యాపారంను ముందుకు నడిపిస్తున్నారని, ప్రయివేట్ కేంద్రాల యాజమాన్యం నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యమైన సిబ్బంది ముడుపులు తీసుకుంటున్నారని, ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం అయితే అధిక ఫీజులతోను, అనవసరమైన అనధికార ఫీజులతోను విద్యార్థుల కుటింబీకులను కాబోలు వడ్డి వ్యాపారస్తులను 
మై మరిపిస్తున్నారని, ఫీజులు చెల్లించటంలో కాస్త ఆలస్యం అయితే విద్యార్థులను క్లాసులకు రానీయకపోవటం, ఆన్ లైన్ క్లాసులు కట్ చేయటం, పరీక్షల వేళ ఆల్ టిక్కెట్ ఇవ్వకపోవడం, తోటి విద్యార్థుల ముందు అవమానించటం లాంటి పనులు చేస్తు విద్యను కాబోలు వ్యాపారంగా మార్చేసారని, సంబంధిత అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు చోద్యం చూస్తుందని ఆయన విమర్శించారు. 
ప్రభుత్వ ఆసుపత్రుల్లోను, ప్రయివేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోను సొమ్ములున్నవారికే భాద్యయుతమైన వైద్య సేవలు లభ్యమైతున్నాయని, ప్రైవేట్ శక్తులతో కుమ్మక్కైన ఆసుపత్రి యాజమాన్యం అక్కరకులేని వైద్య పరీక్షలు సిఫార్స్ చేస్తు రోగిని ఆర్ధికంగా దోచుకుంటున్నారని, కనురెప్పలు, నాలుక, చేతి నాడి, శారీరక ఉష్ణోగ్రతను  చూసి వైద్యం చేసే వైద్యులు నేడు కరువయ్యారని,
డబ్బులు  ఖర్చు పెట్టుకోలేని వారు చిన్న చిన్న అనారోగ్యాలకు సైతం మృత్యువాత చెందుతున్నారని, ప్రయివేట్, కార్పొరేట్ వైద్యం అంత విదేశీ మాఫియా కనుసైగలో నడుస్తుందని, వైద్యులు మెరుగైన వైద్య సేవలు రోగులకు అందించటం మరిచిపోయి కార్పొరేట్ శక్తులు సూచించిన విధంగానే నోట్ల వైద్యాన్ని అందిస్తున్నారని, చాలా చిన్న చిన్న రోగాలుకు లక్షలు వసూలు చేసే ఖరీదైన  ప్రయివేట్ కార్పొరేట్ వైధ్య యాజమాన్యం మన వంటింటి బామ్మల వైద్యం ముందు ఏ మాత్రం సరిపడరని, గ్రామాల్లో చాలా మంది 
ఆర్ ఎమ్ పిలు, 
పి ఎమ్ లు కూడా చాలా గొప్ప గొప్ప వైద్య సేవలు అందిస్తు ప్రజల మన్ననలు పొందుతున్నారని, కరోనా మహమ్మారి నుండి సొమ్ములు ఖర్చు చేసుకున్న వారిని కూడా ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కాపాడలేక పోయాయని, మన పెద్దలు కాషాయాలు, పూర్వపు ఆహార అలవాట్లు ప్రాణాలు నిలిపాయని ఆయన గుర్తు చేసారు. అన్ని రక్త పరీక్షా కేంద్రాల్లోను, స్కానింగ్ సెంట్రల్లోను, ఎక్స్ రే కేంద్రాల్లోను ఒకే విధమైన ధర వుండే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారిచేయకపోవటం ప్రజల దురదృష్టం అని, మార్కెట్ లోను నకిలీ మందులు స్వైర విహారం చేస్తున్నాయని, మందుల షాపుల్లో లభ్యమయ్యే  నాసిరకం మందులుతో రోగులు అల్లాడి పోతున్నారని,నకిలీ మందులు తయారీ పైన, నాసిరకం మందులు తయారీ పైన సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా అవినీతికి మార్గం చేసుకోవటం బాధాకరమని ఆయన తెలిపారు. ఉచిత పథకాల ముసుగులో నిధులు ప్రక్కదారి పడుతున్నాయని, అర్హులకు రిక్త హస్తాలే మిగులుతున్నాయని, ప్రభుత్వ ప్రజా ధనం ఆర్ధిక సంక్షోభంను ఎదుర్కొంటుందని, ప్రయివేట్, కార్పొరేట్ విద్యా వైద్యం దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుందని, అందుకే విద్యా వైద్యం ను జాతీయం చేయాలని, మెరుగైన విద్య, వైద్యం ను ఉచితంగా ప్రభుత్వమే అమలుచేయాలని, ప్రయివేట్, కార్పొరేట్ విద్య, వైద్యం ను ప్రభుత్వం రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సభకు ఆర్పిసి నగర సెక్యులర్ పెండ్యాల కామరాజు  అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ కాసా రాజు,దుడ్డె త్రినాధ్,  లంక దుర్గాప్రసాద్, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, 
పి. ప్రసాద్, వాడపల్లి జ్యోతిష్, వల్లి శ్రీనివాసరావు, వల్లి వెంకటేష్, పిల్లాడి ఆంజనేయులు, మార్త ప్రభాకర్, ముదపాక రామకృష్ణ , 
రెడ్డి స్వర్ణ లత, కోట సుశీల, బత్తుల సూర్యనారాయణ తదితరులు పాల్గొనియున్నారు. 

-