ఆనందపురం: జయజయ హే
భీమిలి రూరల్ మండలం వలందపేట గ్రామంలో గల
విద్యా గణపతి పూర్వక అయ్యప్పస్వామి సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధ్వజస్తంభ 9 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా మూలవిరాట్ లకు పంచామృత పంచగంగ, సుగంధ ద్రవ్య జలాలతో అభిషేకం, విశేష వస్త్ర పుష్పఅలంకరణ , మహా మంగళహారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ప్రముఖ గాయత్రి ఉపాసకులు జ్యోతిష్య సుసరాపు కామేశ్వర మాధవ్ శాస్త్రి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
అనంతరం మధ్యాహ్నం నిర్వహించిన అన్నప్రసాద వితరణ ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకులు
కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.తన తండ్రి భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు అన్నదానానికి ఆర్థిక సాయం అందించినట్లు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తెలిపారు.
ఈ మహా అన్నదానం లో ఆలయ ధర్మకర్త చిల్ల అప్పలరెడ్డి, కోసన శ్రీనివాస్ , డెక్కటి శివ రెడ్డి, బోయి వెంకటరెడ్డి, నగిరెడ్ల రాంబాబు, కంబపు దుర్గయ్య రెడ్డి, చిల్ల గోపాల్, ఎరుసు అప్పారావు, ఎరుసు అప్పలకొండ తదితరులు పాల్గొని సహాయసహకారాలు అందించారు. ఈ అన్నదానం లో 3000 మంది పైచిలుకు భక్తులు పాల్గొన్నారు.