*ఆనందపురం* : పిఆర్ సి ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్న నిరసనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన పిఆర్ సి తో వచ్చిన పే స్లిప్ లకు పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేశారు.
పిఆర్ సి పోరాట సమితి ఆధ్వర్యంలో ఆనందపురం వేములవలస జంక్షన్ వద్ద నేడు 5 డిఎలతో పెరిగిన జీతం అంటూ ఊరిస్తున్నప్రభుత్వ ప్రకటనకు నిరసనగా పాఠశాలలో తోటి ఉపాధ్యాయులతో రివర్స్ పిఆర్ సి ఫలంగా వచ్చిన మొదటి జీతం పే స్లిప్పులను దహనం చేసి నిరసన తెలిపారు.
రేపు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడూ లేనిది నేడు విజయవాడ బిఆర్ టిఎస్ రోడ్ లో సిసి కెమెరాలన్నింటిని యుద్ద ప్రాతిపదికన పోలీస్ శాఖవారు మరమ్మతులు చేస్తున్నారు.
నిన్న సాయంత్రం నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు వెళ్లకుండా అన్ని విధాలుగా అడ్డంకులు పెడుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కె.ఆర్.కే.రావు. పట్నాయక్, వెంకటరావు, గొట్టిపల్లి ప్రధాన ఉపాధ్యాయులు సన్యాసిరావు, వెల్లంకి ప్రధాన ఉపాధ్యాయులు బాబులాల్, మురళి, భాస్కర్ రావు మరియు ఇతర ఉపాధ్యాయులు, పిఆర్ టియు, టిఎన్ యుఎస్, యూటిఎఫ్, ఎపిటీఎఫ్ ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.