ఆంధ్రుల కోసం ఏ ప్రగతి సాధించలేని లోక్సభలో ఆంధ్ర ఎంపీలకు ఉప్పు కారం దట్టించిన తిండి పెట్టండి మేడ శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు రాజమండ్రి


-------------
బడ్జెట్ పై పళ్ళు ఇకలించిన ఆంధ్ర ఎంపి లు రాజీనామా చేయాలి. ఆంధ్ర ఎంపిలకు సిగ్గు వుంటే జీతాలు వదులుకోవాలి. మరో మారు ఆంధ్రప్రదేశ్ పై విషం కక్కిన మోది సర్కార్. కేసీఆర్ మత్తు మాటలు, జగన్ అసమర్ధత తెలుగు రాష్ట్రాలకు శాపం. 
ఉద్యోగుల్లో వచ్చిన తెగింపు ప్రజల్లో రావాలి. 
------------రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్, పిలుపు, నిచ్చారుపార్లమెంట్ క్యాంటిన్ లో ఆంధ్ర లోక్ సభ సభ్యులకు ఉప్పు కారం తో కూడిన ప్రత్యేకమైన వంటకాలు సరఫరా చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రుల తరుపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు . ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు చేవ సచ్చి బ్రతుకుతున్నారని, పార్లమెంట్ సభ్యులు సాక్షిగా మొన్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం జరుగుతున్నా నోరు మెదపకుండా పళ్ళు ఇకళించుకుంటు కూర్చున్నారని,బడ్జెట్ లో ఆంధ్ర కు ఏ ఒక్క కేటాయింపు  కేటాయించకుండా మోది సర్కార్ ఆంధ్రప్రదేశ్ పై మరో సారి విషం చిమ్మిందని, మోది ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ను దోచి పెట్టడానికి రాష్ట్రాన్ని  ఒక గని వలే  వాడుకుంటుందని, ఆంధ్ర లో నేతలు లేకపోయారని, రాజకీయ దళారులు మాత్రమే ఉనికిని చాటుకుంటున్నారని,ఢిల్లీ లో మన ఆంధ్ర ఎంపి లు పిజా బర్గర్ లకు అలవాటు పడి ఆంధ్ర పౌరుషాన్ని చంపి నర్తనశాల ల వలే జీవిస్తున్నారని, నా ఆంధ్ర భవిష్యత్ ఏమిటి, నా బిడ్డ భవిష్యత్ ఏమిటి, నా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఏమిటి, గతిస్తున్న 
నా ఆంధ్రుడి చరిత్ర ఏమిటి అని ఆలోచించే వాడు, చట్టసభల్లో ప్రశ్నించే వాడు ఆంధ్రుడిగా  లేకపోవడం ఆంధ్రుల దురదృష్టం గా భావించాలని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఆంధ్ర ఎంపిలకు ఏమాత్రం సిగ్గు, ఆత్మాభిమానం వుంటే ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రుల కోసం 
ఏ ప్రగతి సాధించలేక పోతున్నందుకు ఆత్మాభిమానం వుంటే  తీసుకుంటున్న జీతాలు వదులుకోవాలని, పదవులకు రాజీనామాలు చేయాలని, ఆంధ్ర ఎంపిలు ప్రాతినిత్యం  వహిస్తున్న సొంత నియోజకవర్గాలలో ప్రజలు బూతులు తిడుతున్నారని, ఆత్మాభిమానం గల ఇద్దరు ఆంధ్ర ఎంపిలు మాత్రం నిజాయితీగా వారి తప్పును, వారి పార్టి లోపాలను  అంగీకరిస్తున్నారని,  సన్నిహితులు వద్ద పచ్చాత్తాపపడుతున్నారని, నియోజక వర్గాల్లో ఎంపి నిధులను కమీషన్ల కోసం కాకుండా  మౌలిక సదుపాయాల కోసం మాత్రమే వినియోగించే ఎంపిలు నేడు కరువయ్యారని, మన ఆంధ్ర ఎంపిలు ఢిల్లీలో కేంద్ర మంత్రులకు నామ మాత్రంగా వినతి పత్రాలు సమర్పించి వారితో  ఫోటోలు దిగి సొంత నియోజకవర్గాలకు వచ్చినప్పుడు స్థానిక మీడియా వారికి అక్కడ దిగిన ఫోటోలను చూపించి మన నియోజకవర్గంకు త్వరలో వందల కోట్లు గ్రాంటు వస్తుందని పదునైన అబద్దాలతో నియోజకవర్గ ప్రజలను నమ్మించటం  పరిపాటిగా మారిందని, మన ఎంపీల నాటకాలను ఆయన ఎత్తి పొడిచారు. మొన్న బడ్జెట్ లో మోది సర్కార్  ఆంధ్రప్రదేశ్ పై మరో సారి కాలకూట విషం చిమ్మిందని,  కేంద్ర ప్రభుత్వ మోసాన్ని మన ఆంధ్ర ఎంపిలు ఎండగట్టక పోవటం వెనుక అనేక సొంత  స్వప్రయోజనాలు, బలహీనతలు దాగి వున్నాయని,మన ఎంపీల కన్నా కొంతమంది పంచాయతీ స్థాయి సభ్యులు కొంతమేరకు స్థానిక ప్రజల హృదయాలు గెలుచుకుంటున్నారని,ఆంధ్రప్రదేశ్ లో గల బిజెపి పార్టి కి ఆంధ్ర కు జరుగుతున్న అన్యాయం కనపడకపోవడం శోచనీయం అని,ఏపి ముఖ్యమంత్రి జగన్ అసమర్ధత మోది సర్కార్ కు వరంగా మారిందని,  
ఆంధ్ర బిజెపి రాష్ట్ర శాఖ కు మోది భజన తప్ప రాష్ట్ర భవిష్యత్ అక్కరకు లేకుండా పోయిందని,రాష్ట్ర వనరులను, అపార ఖనిజ వనరులను, విలువైన గ్యాస్, క్రూడాయిల్ నిక్షేపాలను  దోచుకుని 
ఆంధ్రప్రదేశ్ ను ఎడారి గా మార్చటమే మోది సర్కార్ ప్రధాన లక్ష్యం అని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్, కడప ఉక్కు, రామాయపట్నం మేజర్ పోర్ట్, కాకినాడ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్,రాజమండ్రి లో సాంస్క్రుతిక అకాడమి, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ మరెన్నో కేంద్ర ప్రభుత్వ హామీలను అమలు చేయకపోగా వాటి కోసం ప్రశ్నించే ఎంపిలు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ లో లేకపోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు. 
రాజ్యాంగ రద్దు కోసం ఈ మధ్య మత్తు మాటలతో గాలి మాటలుతో ప్రసంగాలు గుప్పించిన కేసీఆర్ ముందుగా దళిత ముఖ్యమంత్రి కోసం సమాధానం చెప్పాలని, అమరుల త్యాగాలను, వారి చరిత్ర ను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో కనపడకుండా చేస్తున్న కుట్ర పై సమాధానం చెప్పాలని, సెక్యులర్ కూటమి ఏమైందో సమాధానం చెప్పాలని, 
ఆ తరవాతనే రాజ్యాంగం కోసం మాట్లాడే అర్హత కేసీఆర్ కు  వుందని, తెలంగాణా పౌరులు ఉద్యమ వీరులు అని,  కాని  కేసీఆర్ మోసాన్ని జయించలేకపోతున్న అమాయకులని, తెలంగాణా కు దళిత ముఖ్యమంత్రి స్థానం, అమరుల త్యాగాలకు జరుగుతున్న అన్యాయం పై కేసీఆర్ సమాధానం చెప్పాలని, మత్తు మాటలతో రాజ్యాంగ సంక్షోభం కు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని,రాష్ట్ర విభజన అనంతరం కూడా  ప్రాంతీయ విబేధాలుతో తెలుగు వారి మధ్య విబేధాలకు ఆజ్యం పోస్తు రాజకీయ లబ్ది పొందాలనుకోవటం కేసీఆర్ కే చెల్లిందని, విభజన అనంతరం తెలంగాణా రాష్ట్రం ను ఎంత మేరకు అభివృద్ధి పరిచారో కేసీఆర్ చెప్పగలరా అని, అంబేద్కర్ పట్ల, దళితుల పట్ల కేసీఆర్ కు చిన్న చూపు వుందని, అంబేద్కర్ ప్రపంచం మెచ్చిన మేధావి అని మరచి రాజ్యాంగం రద్దు అని శాస్త్రీయత లేని మత్తు మాటలతో మరో హింసకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు. 
చలో విజయవాడ పిలుపుతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆనాటి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తిని, తెగువను చూపారని, ఆంధ్రుల శక్తిని, పౌరుషాన్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను  ఉద్యోగుల ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చిరించారని, నేడు ఆంధ్రప్రదేశ్ ను యుద్ధ ప్రాతిపదిక అన్ని రంగాల్లోను కాపాడుకోవటానికి శాంతియుత తిరుగుబాటు అవసరం వుందని, ఏపిని కాపాడటంలో ప్రస్తుత ప్రధాన రాజకీయ పక్షాలు విఫలమైయ్యాయని, ప్రజలే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పరచుకునే సువర్ణ అవకాశం నేడు ఆశన్న మైనదని, ఏపిని కాపాడుకుందాం రండి కదలి రండి అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రులకు పిలుపు నిచ్చారు. సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. 
ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి,కాసా రాజు,  లంక దుర్గా ప్రసాద్, ఎండి హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డె సురేష్, మోర్త ప్రభాకర్, పిల్లాడి ఆంజనేయులు, వల్లి శ్రీనివాసరావు, కొల్లి సిమ్మన్న, రెడ్డి స్వర్ణలత, కోట సుశీల,  బత్తుల సూర్యనారాయణ, మాసా అప్పాయమ్మ, నాగూరి అన్నపూర్ణ, మాసా సుభద్ర, కొలిమళ్ల లక్ష్మణరావు, కొల్లిమళ్ల అనంతలక్ష్మి, గోపాలవరపు గోపీచంద్, కొత్తపల్లి సుధాకర్, ఇళ్ల నాగ శైలజ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనియున్నారు. 

--మేడా శ్రీనివాస్, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్