Lఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కు భీమిలి నియోజకవర్గ అధ్యక్షునిగా,భీమిలి సన్ స్కూల్ డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భీమిలి నియోజకవర్గ పరిధిలో భీమిలి,ఆనందపురం,పద్మనాభం మరియు మధురవాడ కేంద్రాలుగా సుమారు 40 పాఠశాలలు అప్పుస్మా సభ్యులుగా ఉన్నాయి.
2022-24 (2) సంవత్సరాలకి గాను,ఈ సంఘానికి నూతన కార్యవర్గ ఎన్నిక మధురవాడ శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ ప్రాంగణంలో జరిగింది.
ఈ సందర్భంగా,తిరిగి రెండవ పర్యాయం ఎన్నికైన భీమిలి అధ్యక్షులు కైతపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో, పరిష్కారించడంలో శక్తివంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
గౌరవాధ్యక్షులుగా ఆర్. రాధాకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎస్.కె.ఎమ్.డి షరీఫ్, వై. వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా బి. కృష్ణ, సంయుక్త కార్యదర్శిగా పి. నాగమణి, కోశాధికారిగా ఆర్. వెంకటేశ్వరరావులను ఎన్నుకోవడం జరిగింది.
ఈ ఎన్నికలను సంఘం రాష్ట్ర కోశాధికారి ఎం. వి. రావు నిర్వహించగా , రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్. శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి ఎం.వి.వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భీమిలి రిపోర్టర్
పి శ్రీనివాసరావు