చలో ఆంధ్ర యూనివర్సిటీ పోస్టర్ ఆవిష్కరించిన నారా లోకేష్

 *విశాఖపట్నం* :  ఆంధ్ర యూనివర్సిటీ అరాచక మరియు అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా మార్చి 3న తలపెట్టిన 'చలో ఆంధ్ర యూనివర్సిటీ ' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆవిష్కరించారు.
           ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి ని తక్షణమే రీకాల్ చేయాలని అఖిలపక్షం తలపెట్టిన చలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. 

            కార్యక్రమంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ దువ్వారపురామారావు ,తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్, విశాఖ టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటరీ అధ్యక్షుడు ఎస్.రతన్ కాంత్, కోరాడ వైకుంఠ రావు తదితరులు పాల్గొన్నారు.