టీం తారక్ ట్రస్ట్ విశాఖపట్నం జిల్లా కో - ఆర్డినేటర్ గా లెంక :

 *ఆనందపురం* : ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల లో ఒక్కటైన టీం తారక్ ట్రస్ట్ విశాఖపట్నం కో-ఆర్డినేటర్ గా ఆనందపురం మండలం, 
          మిందివానిపాలెం గ్రామానికి చెందిన లెంక సురేష్ నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు గా తను చేస్తున్న సేవలను గుర్తించి, తనను విశాఖ కో-ఆర్డినేటర్ గా నియమించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
         
        అంతేకాకుండా తన చేస్తున్న సేవలకు ఇప్పటివరకు సహాయ - సహకారాలు అందించిన ప్రతీ ఒక్క తారక్ అభిమానికి ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా తమ అభిమాన నటుడు పేరు మీద జిల్లా  లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఆయన అన్నారు.
   
       త్వరలో జిల్లా లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో టీం తారక్ ట్రస్ట్ కమిటీ లను ఏర్పాటు చేసి, జిల్లా వ్యాప్తంగా ట్రస్ట్ సేవలను మరింత విస్తృతం చేస్తామని అన్నారు. 

     అనంతరం తనను కో - ఆర్డినటర్ గా నియమించినందుకు ట్రస్ట్ వ్యవస్థాపకులు యార్లగడ్డ మనూ గారికి, అజయ్ తారక్ గారికి, పెద్ది విక్రమ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.