సేవా కార్యక్రమాల్లో కోరాడ నాగభూషణరావు సేవలు భేష్..........!



 ఆనందపురం: జనసేవ న్యూస్ 
మండలంలోని వేములవలస మాజీ సర్పంచ్,  మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు మరోసారి అతని ఔదార్యాన్ని చాటుకున్నారు.

 భీమిలి  రూరల్ మండలం చిల్లపేటలో కొత్తగా నిర్మిస్తున్న దుర్గమ్మ తల్లి ఆలయానికి ఆయన 50 వేల రూపాయలు విరాళంగా ప్రకటించారు.  అతని కుమారుడు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్  జ్ఞానేశ్వర్ చేతుల మీదుగా అందజేశారు.

 కోరాడ నాగభూషణరావు దాతృత్వాన్ని అందరూ కొనియాడారు. ఆధ్యాత్మిక చింతనతో  ఆయన అందించిన సాయాన్ని  మరవలేక పోతున్నాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిల్లా అప్పలసూరి రెడ్డి, చిల్లా భాస్కర్ రెడ్డి, శివ రెడ్డి, శివ ఆంజనేయ  పాల్గొని తండ్రి కొడుకులు ఇద్దరకు కృతజ్ఞతలు తెలిపారు.