అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా కార్యదర్శి గా కాకర సురేష్ కుమార్

 అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ముఖ్య కార్యదర్శి అయునుల్ హుస్సేన్
నియామక పత్రం అందచేశారు.

సేవా రంగంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్, కెరీర్ డెవలప్మెంట్ మరియు లాక్ డౌన్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ,  సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను నిర్వహిస్తున్నారని అందుకుగాను IHRC జిల్లా కార్యదర్శి గా నియమిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా  కాకర సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని మానవజాతి మొత్తం ఒక కుటుంబం లాంటివి. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నట్టే, గౌరవం అందినట్టే, ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి ఆ హక్కులు, గౌరవం అందాలి. 
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం హక్కులను కల్పించారు .
ప్రతి ఒక్కరూ హక్కులు గురించి అవగాహన కలిగి ఉండాలని,ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా  అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తే తప్పకుండా వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

ప్రతి ఒక్కరు కూడా వారి ప్రాథమిక హక్కులను తెలుసుకోవాలని కోరారు.


నాకు ఇలాంటి బాధ్యతను అందించినందుకు   ఐ హెచ్ ఆర్ సి ముఖ్య కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానీ తెలిపారు.