కనకరాజు కు కీలక పదవి

జనసేవ న్యూస్ : ఆనందపురం 
విశాఖ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రచార కమిటీ కార్యదర్శిగా ఇనపకుర్తి కనకరాజు
ఆనందపురం గ్రామానికి చెందిన ఇనపకుర్తి కనకరాజు విశాఖ జిల్లా నాయి బ్రాహ్మణ ప్రచార కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 
ఈరోజు విశాఖపట్నం జరిగిన సమావేశంలో విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆరిపాక పెంటారావు విశాఖ జిల్లా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెంపటాపు నూకరాజు విశాఖ జిల్లా అధ్యక్షులు నరవ పైడిరాజు చేతుల మీదగా నియామక పత్రం అందుకున్న ఇలపకుర్తి కనకరాజు ఆనందపురం మండలం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేవ గుప్త రమేష్ కోశాధికారి గోవాడ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.