వేములవలసలో మంత్రి 'బొత్స' సందడి!

ఆనందపురం :జయజయ హే
     వివాహ వేడుకల్లో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆనందపురం మండలం వేములవలస గ్రామానికి విచ్చేసారు. 

అతని రాకతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ గ్రామంలో గల అతని బంధువులు భీమిలి మాజీ  ఏఎంసీ చైర్మన్  కోరాడ నాగభూషణరావు,  

    అతని సోదరుడు కోరాడ సూర్యరావులను  మర్యాదపూర్వకంగా కలుసుకుని వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోరాడ నాగభూషణరావు తో ఆయన కాసేపు భేటీ అయ్యారు. 

ఈ తరుణంలో వేములవలస పంచాయతీ లో గల సమస్యలపై వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన  మంత్రి బొత్స వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.