అభివృద్ధి పనులపై సమీక్ష

రామభద్రపురం: జనసేవ న్యూస్ 

మండలంలో ఓటియస్ ను వేగవంతం చేయడానికి అందరూ క్రుషి చేయాలని మండల పరిషత్ అభివ్రుధ్ది అధికారిణి ఏ. రమామణి కోరారు.

మంగళవారం ఉదయం స్థానిక మండల పరిషత్ అభివ్రుధ్ది కార్యాలయంలో యమ్పీడీఓ రమామణి ఆద్వర్యంలో కన్జెర్వెన్సీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆమె అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రతీ నెల జరిగే ప్రక్రియలో బాగంగా జరిగిన సమావేశంలో మండలంలో ఉపాధి హామీ పథకం నిధులతో మండలంలో అభివ్రుధ్ది పనులకోసం తీర్మానం చేసారు.విద్యాశాఖలో నాడు నేడు పనులను సమీక్షించారు.

వైద్య ఆరోగ్య శాఖలో వాక్సినేషన్ శతశాతం పూర్తి చేసుకొని బూస్టర్ డోస్ కూడా ప్రారంభించామని,దానిని కూడా పూర్తిచేసి,ఒమిక్రాన్ పై గ్రామస్థాయిలోఅవగాహన కల్పించాలని కోరారు.

గ్రుహ నిర్మాణం శాఖ ఆద్వర్యంలో గ్రామాల్లో ఓటియస్ ను వేగవంతం చేయడానికి క్రుషి చేయండని కోరారు.

ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ జి.జ్ఞానేశ్వర్,మండల విద్యాశాఖాధికారి ఏ. తిరుమలప్రసాద్,హౌసింగ్ ఏఈ సత్యారావునాయుడు,ఉపాధిహామీ ఏపిఓ కోట సుశీల,వెలుగు ఏపియమ్ రెడ్డి శ్రీరాములు,వైద్య ఆరోగ్య శాఖ సిహెచ్ఓ చిన్నిక్రిష్ణ,మండల కార్యాలయ సీనియర్ సహాయకుడు చొక్కాపు శ్రీరాములునాయుడు,పూడి కిరణ్,షణ్ముఖ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.