టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ కమిటీ లో మండలం లో నలుగురి చోటు :

ఆనందపురం: తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమైక్య నియోజకవర్గ నూతన కమిటీ లో ఆనందపురం మండలానికి చెందిన నలుగురు నియమితులయ్యారు. 
నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గా గిడిజాల గ్రామానికి చెందిన కోరాడ వైకుంఠ రావు,


 అధికార ప్రతినిధి గా దిబ్బడపాలెం గ్రామానికి చెందిన షినగం సోమునాయుడు


ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ప్రకృతివానిపాలెం గ్రామానికి చెందిన నీలతి నర్సింగ్ రావు,



 సెక్రటరీ గా తర్లువాడ గ్రామానికి చెందిన బసన అప్పలరాజు లకు 

నియోజకవర్గ కమిటీ లో చోటు దక్కాయి. ఈ సందర్భంగా కోరాడ వైకుంఠ రావు మాట్లాడుతూ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా తను చేసిన సేవలను గుర్తించి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గా నియమించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పై నిరంతరం కృషి చేస్తానని, విద్యార్థులకు ప్రభుత్వానికి వారధి లా ఉంటూ విద్యార్థులకు అండగా ఉంటానని తెలిపారు. అనంతరం తమ కు ఈ పదవి రావటానికి సహాయం చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ చౌదరి గారికి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ గారికి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు గారికి, పార్లమెంట్ అధ్యక్షులు రతన్ కాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.