భీమునిపట్నం చిన్నబజర్ 1996 లో నిర్మించిన అభయ ఆంజనేయస్వామి దేవాలయములో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేయడం చాలా బాధాకరం.
6దుండగులు కలసి చేసినటువంటి కేవలం వినోద్ అనే వ్యక్తి మాత్రమే అరెస్టు చేసి మిగిలిన దుండగలు యొక్క పూర్తి వివరాలు తెలిసినప్పటికీ కుటుంబ కలహాలు అనే నెపంతో ఇప్పటివరకు వారిని పోలీసు వారు మిగిలిన దుండగులను అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలు కలిగిస్తుంది.
కాబట్టి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో
తేదీ: 04-02-2022 ఉదయం 10 గంటలకు భీమిలి పోలీస్ స్టేషన్ వద్ద భారతీయ జనతా పార్టీ మరియు వివిధ హైందవ సంఘాలు కలసి నిరసన కార్యక్రమం జరుగుతుంది.
పూడిపెద్ది శర్మ
విశ్వహిందూ పరిషత్ విశాఖ నగర ప్రముఖ