ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

భీమునిపట్నం, ఫిబ్రవరి 28,విశాఖ టుడే
 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమిలి పండిట్ నెహ్రు హైస్కూల్ లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన చూపరలను ఎంతో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమాన్ని డైట్ ప్రిన్సిపాల్ యు.మన్యాల నాయుడు ప్రారంభించగా ముఖ్య అతిధిగా భీమిలి జోనల్ కమిషనర్ వెంకటరమణ , ప్రత్యేక ఆహ్వానితులుగా జివిఎంసి డి.వై.ఈ.వో శ్రీనివాసరావు, ఎం.ఈ.ఓ బాలమణి హాజరయ్యారు.  ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల

ప్రధాన అధ్యపకరాలు ఎం.తిరుమల శ్రీదేవి మాట్లాడుతూ భారతరత్న , నోబెల్ బహుమతి గ్రహీత సి.వి రామన్  ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ను కనుగొని శాస్త్ర ప్రపంచాన్ని అబ్బుర పరిచారని ఆయన గుర్తుగా ఈ రోజున సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, 

ఈ వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వారిలోని ఉన్న సృజనాత్మక శక్తి పెంపొందించడానికి దోహద పడుతుందని అన్నారు. 

ఈ వైజ్ఞానిక ప్రదర్శన లో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు చే ఏర్పాటు చేయబడిన పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకొరకు అదేవిదంగా మత్స్య సంపదను కాపాడుకోవడానికి తీసుకోవలిసిన జాగ్రత్తలు మొదలయిన ప్రదర్శనలను అతిధులు అభినందించారు.  

ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు