విద్యార్థులకు స్టేషనరీ పంపిణీకోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

ఆనందపురం :జయజయ హే

 మండలంలోని వెల్లంకి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ మరియు యువకులకు వాలీబాల్ కిట్లను టిడిపి యువ నాయకుడు, వేములవలస పంచాయతీ ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ అందజేశారు. 

తన తండ్రి భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు ఆర్థిక సాయంతో  సమకూర్చినట్లు చెప్పారు. స్వామి దయానంద సరస్వతి జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడల పట్ల మక్కువ చూపాలన్నారు. ప్రభుత్వం కూడా క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. భీమిలి నియోజకవర్గం లోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాలలో గల యువతను ఉత్తేజ పరిచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 

పార్టీలకతీతంగా అందరినీ కలుపుకొని యువతకు అన్ని రకాలుగా చేదోడువాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తో పాటు ఎంపీటీసీ పడాల అప్పలనాయుడు, సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, ఉప సర్పంచ్ కంచరాపు శ్రీనివాస రావు, చెన్నా నరసింగరావు, సాడి ముత్యాల రెడ్డి, చెన్నా రాజు, తాడిశెట్టి సూరిబాబు, చిల్లా రాజు, ఎర్రంశెట్టి అప్పలరాజు, తాడిశెట్టి దొరబాబు, లండ సాయి పవన్, నడిమింటి అప్పలరాజు, కోరాడ రమణ, కోరాడ మహేష్  తదితరులు పాల్గొన్నారు.