మిందివానిపాలెం లో ఘనంగా శ్రీ మరిడిమాంబ తీర్థ మహోత్సవం :

 ఆనందపురం : మండలంలోని  మిందివానిపాలెం లో కొలువుదీరిన శ్రీ మరిడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవం  ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం గ్రామస్తులంతా మేళతాళాలు, చీర , సారేలతో ఊరేగింపుగా శ్రీ భూలోకమ్మ, శ్రీ పైడితలమ్మ, శ్రీ బంగారమ్మ అమ్మవార్ల మందిరాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 సాయంకాలం మరిడిమాంబ అమ్మవారి గుడి వద్ద భక్తులు హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ మహోత్సవం జరిగింది, ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ మరిడిమాంబ యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు మరియు పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.