నిత్యవసర సరుకులు పంపిణీఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

జనసేవ న్యూస్ : ఆనందపురం
       మండలంలోని వేములవలస పంచాయతీలో గల కరోనా వారియర్స్కు స్థానిక ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, వీఆర్వో శ్రీనివాసరావు లు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ  చేశారు. 

కరోనా కష్టకాలంలో నిబద్ధతతో విధులను నిర్వహించిన సచివాలయ సిబ్బంది,  వాలంటీర్లు, ఏ.ఎన్.ఎం లు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.

భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు ఆర్థిక  సాయం అక్షయపాత్ర వారి సహకారంతో ఈ నిత్యావసర సరుకులను అందజేశారు. 

సుమారు 11 రకాల నిత్యావసర సరుకుల తో కూడిన ఈ కిట్లను 100 మందికి అందజేశారు. 

ఈ కార్యక్రమంలో వేములవలస పూల మార్కెట్ ఆశీల్ కాంట్రాక్టర్ బోధ అప్పలరాజు, ఎర్రాజీ  స్వామి నాయుడు, నడిమింటి అప్పలరాజు, కోరాడ రమణ, తాడి జగదీష్ , కోరాడ వెంకటరావు, కోరాడ గణేష్ , కోరాడ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

జీ రవికిషోర్ బ్యూరో చీఫ్