ఆ జిల్లాల్లో సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

 
జనసేవ న్యూస్  తెలంగాణ :
           తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న మేడారం జాతర సమ్మక్క సారక్క జాతర గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే , 
ఈ పండుగ ఒక జాతర లా  జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా పలు జిల్లాలలోని సేవలను శుక్రవారం రద్దు చేయనున్నట్లు గా ప్రకటించడం జరిగింది.

 ముఖ్యంగా వరంగల్ ఈ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా ల సెలవు ఉంటుందని ఆ జిల్లా కలెక్టర్ తెలియజేయడం జరిగింది. ఆ జిల్లాలో ఉండే అన్ని రకాల విద్యా సంస్థలు, స్థానిక సంస్థలకు సెలవు దినం ప్రకటించడం జరిగింది.

అయినప్పటికీ కూడా బ్యాంకులు మాత్రం తెరిచి ఉంటాయని తెలియజేశారు జిల్లా కలెక్టర్. అయితే శుక్రవారం రోజున సెలవు దినంగా ప్రకటించి మార్చి 12వ తేదీ రోజున వర్కింగ్ డే ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. 

ఇక సమ్మక్క సారక్క జాతర లు కన్నుల పండుగగా సాగుతున్నా ఈ నేపథ్యంలోనే అందరికీ సెలవు దినంగా ప్రకటించడం తో కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

 ఇక్కడి జనాలని చూస్తే ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని గిరిజన సంప్రదాయంలో పూజలు చేసి అనంతరం వారిని తీసుకు రావడం జరిగిందట.

ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజున వెన్నెలలో సమ్మక్క ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించి, మేళతాళాలతో వారిని గద్దల పైకి తరలించడం జరిగిందట. 

ఇప్పటివరకు ఈ జాతరకు 70 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని.. మరో మూడు రోజుల్లో 60 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు..

 సమ్మక్క తల్లి భక్తులు వనదేవత ను దర్శించడం కోసం మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నేపథ్యంలో అధికారులు వారికి తగ్గట్టుగా ఏర్పాట్లను చేయడంలో నిమగ్నులయ్యారు.