*విశాఖపట్నం* :
ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషాద ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని రోలుగుంట మండలం జే.నాయుడుపాలెంలో ఇద్దరు పిల్లలను తల్లి బావిలో తోసేసి తల్లి ఆత్మహత్యా యత్నం చేసుకోగా, ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తల్లిని స్థానికులు కాపాడారు.
కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో పాటు తల్లి బావిలో దూకింది. స్థానికులు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
అయితే అప్పటికే ఐదేళ్ల బాలిక భాను, మూడేళ్ల బాలుడు పృథ్వీ మృతి చెందారు. తల్లిని కాపాడారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను వెలికితీయించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.