నేల్తేరులో వివేకానంద జయంతిఆనందపురం:జనసేవ న్యూస్

నేల్తేరులో వివేకానంద జయంతి
ఆనందపురం:జనసేవ న్యూస్ 
వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలో గల నెళ్తెరు గ్రామంలో గల స్వామి వివేకానంద159వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకర సురేష్ కుమార్ మాట్లాడుతూ
నాడు మన దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో వీరులకు ఆయన ఆదర్శం...  
నేడు లక్ష్యం కోసం శ్రమించే యువతరం గుండెల్లో నిత్యం రగిలే జ్వాల. అమెరికాలోని చికాగోలో ఆయన చేసిన ప్రసంగం ఈ నాటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అందుకే వివేకానందుని జయంతిని జాతీయయువదినోత్సవంగా నిర్వహించుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం. 
బలమే జీవితం, బలహీనతే మరణం.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి..’ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
ధర్మాన్ని పాటించమన్నారు.. 
స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతితల్లి వంటిదని అన్నారు.. 
ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదన్నారు..
ఆయన బోధనలు చదివితే చాలు, ఏ వ్యక్తిత్వ వికాస తరగతులు అవసరం లేదన్నారు.39 ఏళ్లే జీవించినా భారతజాతికి శాశ్వత మార్గదర్శిగా నిలిచాడు.
 ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు సాడి శంకర్, సాడి పవన్, జమ్మల శంకర్ , కాకర కిరణ్, కొమ్ము ఉదయ్, చుక్క నాయుడు తదితరులు పాల్గొన్నారు.

జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ ఆనందపుర