జర్నలిస్ట్ కు పెందుర్తి ప్రెస్ క్లబ్ సభ్యులు ఆర్థికసహాయం అందజేత :

పెందుర్తి:  గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న హర్ష ధ్వని పేపర్ ఎడిటర్ దమర్ సింగ్ కనకరాజు ను పెందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాల్మీకి నాగరాజు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ, ఏ సి టి ఈశ్వరరావు, గ్రేటర్ న్యూస్ చక్రి ఆయన నివాసంలో పరామర్శించి, అనంతరం పెందుర్తి ప్రెస్ క్లబ్ తరపున 16000 వేల రూపాయలు  ఆర్థిక సహాయం అందజేశారు. 


ఈ సందర్భంగా అధ్యక్షులు వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కు అయినటువంటి తోటి జర్నలిస్ట్ ఇబ్బందులను తమ ఇబ్బందులు గా భావించి సహాయ సహకారాలు అందించిన జర్నలిస్టు సోదరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టు సోదరులకు ఏ సమస్యలు వచ్చినా పెందుర్తి ప్రెస్ క్లబ్ ముందుండి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డులు మరియు ఇన్సూరెన్స్  వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, జీతం కోసం కాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జర్నలిస్టుల జీవితాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని అలాగే పెందుర్తి అర్బన్ లో కలిసిపోయి ఇప్పటికి ఏడు సంవత్సరాలు దాటినా ఇప్పటికీ కూడా రూరల్ విలేకరి గానే చూస్తున్నారని, ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలని జర్నలిస్టుల నాయకులు కూడా స్పందించి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావాలని  కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు రెడ్డి  సంతోష్, రమేష్, ప్రభాకర్, నేతాజీ, యశ్వంత్ పాల్గొన్నారు....