విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొనండి

*జి వి ఎం సి పాలకవర్గం    రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి* :                    
 *విశాఖపట్నం* : విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్ర బిజేపి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పాలకమండలి డిమాండ్ చేసింది.
ఈ రోజు అనగా జనవరి 22న  జివిఎంసి కౌన్సిల్ హాల్లో  గౌరవ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన  మీడియా సమావేశంలో కోటి సంతకాల ఉద్యమంలో తెలుగు ప్రజలు పాల్గోవాలని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు విజ్ఞప్తి చేశారు.

 ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు జి.శ్రీధర్, కె సతీష్, టిడిపి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, వైసీపీ  ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సిపిఐ ఫ్లోర్ లీడర్ ఎజే స్టాలిన్, సీపీఎం ఫ్లోర్ లీడర్ డా, బి గంగా రావు, జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి పాల్గొన్నారు.